మండల పరిషత్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి): తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా
హుజుర్ నగర్ మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిధిగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం నిర్మాణం చేసిన హైదరాబాద్ లోని బంజారా భవన్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కార్యక్రమంకు గిరిజన ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లే బస్సు ను ఎమ్మెల్యే సైదిరెడ్డి జండా ఊపి బస్సు ను ప్రారంభం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీడీఓ శాంతకుమారి, ఎంపీవో షైక్ మౌలానా, సూపర్నెంట్ నర్సిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, ఏపీఓ శైలజ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.