మంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదు! # ఉద్యమాలు సరే కానీ అనుచిత వ్యాఖ్యలు సహించం, # సిద్దిపేట – గజ్వేల్ తర్వాత జహీరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్న మంత్రివర్యులు, # వేరే రాష్ట్రంలో బకాయిలు ఇవ్వకున్నా జహీరాబాద్ లో సాధ్యమైంది, # ఫాక్యరీ ప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, # మంత్రి పై అనుచిత వ్యాఖ్యలకు బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ కౌంటర్

(జహీరాబాద్ జనం సాక్షి)
చెరుకు రైతుల ధర్నా కార్యక్రమంలో స్థానిక అఖిలపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ ఖండించారు, ముఖ్యంగా జిల్లా ఇంన్చార్జ్ మంత్రివర్యులపై స్థానిక నాయకులు వాడిన పరుష పదజాలము తీవ్రంగా ఆక్షేపించదగినది అని అన్నారు, ఫ్యాక్టరీ ప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, డి.సి.ఎం.ఎస్ చేర్మెన్ శివ కుమార్, ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ నాయకులు ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి వివరాలను తెలిపినప్పటికి, ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకుల, ఉద్యమకారుల కల్లిబొల్లి మాటలతో రైతులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని అన్నారు, ముఖ్యంగా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు జహీరాబాద్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఈ సందర్భంగా అన్నారు, గతంలో ఇక్కడ చెరుకు బకాయిలు ఉన్నప్పటికి, వేరే ప్రాంతంలో ముఖ్యంగా ఆంద్ర రాష్ట్రంలో అదే కంపెనీకి చెందిన బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదు, కానీ ఇక్కడి చెరుకు బకాయిలు ఆపకుండా చెల్లించడం జరుగింది అంటే నే ఆ ఘనత, గౌరవం మంత్రి గారికి దక్కిందని ఇక్కడున్న రైతులు, అఖిల పక్ష నాయకులు గమనించాలి, ఇంకోక విషయం ఏమిటంటే బకాయిల సాధనలో ఇప్పటికే ప్రభుత్వం, కమిషనర్, యాజమాన్యం తో చర్చలు జరిపి, మూడున్నర కోట్లు అందించడం జరిగిందని, మిగత బకాయిలు కూడా చెల్లించిన తరువాత ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ తెలియజేశారు, మాజీ మంత్రి గీతారెడ్డి చక్కర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న జహీరాబాద్ కు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదని, బి.జె.పి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన విమర్శించారు, ఏది ఏమైనా ఉద్యమ భావజాలం నుండి వచ్చాము కాబట్టి ఉద్యమాల్లో ఎప్పుడూ కూడా పరుష పదజాలం మేము వాడలేదు కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక అఖిలపక్ష నాయకులకు పరుష పదజాలం వాడటం సరికాదని, ఎవరిని అగౌరవ పరుచకుండ ఉద్యమాలు చెయ్యాలని, రైతులకోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మేము కూడా ఉద్యమకారులుగా ఇక్కడ ప్రాంతంలో పుట్టాం, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, మా ప్రభుత్వం “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” అనే జాతీయ నినాదంతో ముందుకు పోతుంది కాబట్టి, రైతు శ్రేయస్సే మా లక్ష్యం అని ఢిల్లీ వసంత్ అన్నారు, ఈ కార్యక్రమంలో యల్. జనార్థన్, యాసిర్ ఖాన్, బి.దత్తాత్రి ముదిరాజ్, మహీపాల్ యాదవ్, అప్పం శ్రీకాంత్, విశాల్ గోడ్కే, అశోక్ పాటిల్, దశరథ్ నేత, దినేష్ ముదిరాజ్, నాగేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు,