మంత్రి కార్యక్రమానికి దూరంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు

పేదలకు,టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దళిత బందు అందుతుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్,కేటిఆర్ కి తప్పుడు నివేదికలు అందజేస్తున్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు.
== ఎమ్మెల్యే కు వత్తాసు పలుకుతున్న మంత్రులు.

ములుగు జిల్లా బ్యూరో,సెప్టెంబర్ 22 (జనం సాక్షి):-

ములుగు జిల్లాలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగా ములుగు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు.దళిత బంధు విషయంలో స్పష్టత లేని కారణంగా హాజరు కాలేదు అని స్పష్టంగా తెలుస్తుంది.ఉమ్మడి జిల్లాల ఇద్దరు మంత్రులు ములుగు జిల్లాను పట్టించుకోకుండా కార్యకర్తలను మభ్యపెట్టి ములుగు ఎమ్మెల్యేకు వత్తాసు పలకడమే ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తుంది.
ములుగు జిల్లాలో దళిత బందు టీఆర్ఎస్ కార్యకర్తలు,పేదలకు వస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్ కి తప్పుడు నివేదికలు అందజేస్తున్నారు,కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు.
ములుగు లో ప్రజాప్రతినిధులు తిరగలేని పరిస్థితులు దపరించాయి.ఈ కార్యక్రమనికి ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తప్ప ఎవరూ కార్యక్రమంలో హాజరు కాలేదు.