మంత్రి జానారెడ్డి దిష్టిబొమ్మ దహనం
శాయం పేట: గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి జానారెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఆయన దిష్టిబొమ్మను సోమవారం శాయం పేటలో గ్రామపంచాయతీ ఉద్యోగులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు పెంబర్తి రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.