మంత్రి పొన్నాలతో కడియం శ్రీహరి భేటీ
వరంగల్: తెదేపా నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో మంత్రి పొన్నాలతో భేటీ అయ్యారు. ఎస్సారెస్పీ జలాల కేటాయింపులో వరంగల్ మాట్లాడారు. జిల్లాకు కేటాయింపులో 10 టీఎంసీలు రావలసి ఉండగా కేవలం 2 టీఎంసీలు ఇచ్చి తాగునీటికి, రైతాంగానికి తీరని అన్యాయం చేశారని కడియం అన్నారు. దీంతో పొన్నాల వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ జిల్లాకు రావాల్సిన న్యాయమైన వాటా ప్రకారం నీరందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.