*మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎస్సి రుణాలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు*
బాల్కొండ: ఆగస్ట్ 1 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో బాల్కొండ మండలంలోని 5 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలను ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,సర్పంచ్లు,ఎంపీటీసీలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని బాల్కొండ,కిసాన్ నగర్,బోదెపల్లి,చిట్టా పూర్,బస్సపూర్ గ్రామాలకు చెందిన 7గురు లబ్ధిదారులకు బ్యాంకేతర రుణాలు మంజూరు చేయించారని ఒక్కక్క యూనిట్ విలువ రూ50 వేళా వ్యయం ఉంటుందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతోందని, పేదరికంలో ఉన్న దళితులను ఆర్థికాభివృద్ధిలోకి ముందుకు తీసుకురావడానికి రుణాల ద్వారా సహాయం అందిస్తోందని వారు తెలిపారు. ఈసదావకాశాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందిన ప్రతి దళిత సోదరుడు రూపాయికి రూపాయి పుట్టించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారూ కోరారు లబ్దిపొందిన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి ప్రశాంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు,
ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మామిడి దివ్యా-రాకేష్,కన్నా లింగవ్వ పోశెట్టి,రాం రాజ్ గౌడ్,EP నారాయణ,సనుగుల కవిత-శ్యామ్ సుందర్,నీరడి లత-గంగారాం,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,తెరాస నాయకులు తెడ్డు చక్రి,సీనియర్ అసిస్టెంట్ నవీన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.