మంత్రి వర్గ విస్తరణ అర్థవంతమైన మార్పు
ఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు చేసుకున్న మార్పులను ‘అర్థవంతమైన మార్పు’గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేది అభివర్ణించారు. ప్రసుత్తం మంత్రి వర్గ విస్తరణ అర్థవంతంగా ఉందని, క్యాబినెట్‌లో అనుభవజ్ఞులతో పాటు యువశక్తికి పెద్ద పీట వేశారని అన్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని 2014 ఎన్నికలలో విజయమే లక్ష్యంగ నూతన జట్టు పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.