*మంత్రి సహాయం తో స్టడీ మెటీరియల్*
కమ్మర్పల్లి 06ఆగస్టు(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలం లో హాసకొత్తూర్ గ్రామంలో శనివారం వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ లు ఇస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత కోసం తాను నిపుణులతో తయారుచేయించిన 11 సబ్జెక్ట్ లతో కూడిన 20 సెట్ల స్టడీ మెటీరియల్ మొత్తంగా 40 బుక్స్ ని గ్రామానికి చెందిన విజేత యువజన గ్రంథాలయం వారికి అందజేయడం జరిగింది.
గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ ఈ మెటీరియల్ ఉపయోగపడి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తెడ్డు కిరీటి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నోముల నరేందర్, సొసైటీ వైస్ చైర్మన్ గడ్డం శ్రీధర్, మాజీ సర్పంచ్ భక్కూరి గోపి, మాజీ ఎంపీటీసీ తెడ్డు రాజన్న, పేద్ది కిరణ్ ,కట్ట చిరంజీవి భూఖ్య, మోహన్ జంగం మహేష్ , మేడపు రమేష్ ,గడ్డం రాజేష్, వేంపల్లి రాజు గౌడ్, నాయిని పురుషోత్త0, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.