*మంత్రి హరీష్ రావు ఫోటోకు రాఖీ కట్టి తమ గోడును విలపించుకున్న VRA అక్కచెల్లెళ్ళు*

 మద్దూర్ ఆగస్టు 13(జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 19 వ, రోజుకు చేరుకుంది. మండలంలో పనిచేస్తున్న VRA ఆడపడుచులు  ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీశ్ రావు గారి ఫొటోకు రాఖీలను కట్టి తమగోడును విలపించుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా VRA లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అలాగే VRA లా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలాని తమగోడును వెలబుచ్చుకున్నారు. అలాగే సమ్మెలో ఉన్న మిగతా VRA లకు రాఖీలను కట్టి ఆడపడుచుల అండ సమ్మె విరమించే వరకు తమ వంతు కృషి చేస్తామని మహిళలు అన్నారు. ఈకార్యక్రమంలో VRA-JAC చైర్మన్  లక్ష్మప్ప అలాగే కో కన్వీనర్ సత్యప్ప అలాగే మండల VRA అధ్యక్షుడు ఆంజనేయులు.మొగులప్ప.   రాములు కాంతు. కేశవులు. బసప్ప. పుల్లప్ప.బలరాజ్. కృష్ణ. మహిపల్.  కార్యక్రమంలో 50 మంది VRA లు పాల్గొన్నారు.