మంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

నిజామాబాద్‌, నవంబర్‌ 24 :రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రులు డిఎల్‌.రవీంద్రారెడ్డి రామచంద్రయ్యలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం  తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం స్థానిక బస్‌స్టాండ్‌ ఎదుట మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పోరాట సంఘం జిల్లా కార్యదర్శి మదు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు చెందిన నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్ళించి ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారని, ఈ నిధులు సక్రమంగా వినియోగించుకునేందుకు వేసిన సబ్‌ప్లాన్‌ వెంటనే అమలుచేయాలని డిమాండ్‌చేశారు. మంత్రులిద్దరిపై అట్రాసిటి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఇద్దరి మంత్రులూ దళితులకు, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట సంఘం నగర అధ్యక్షులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.