మంథని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు
900 కోట్లు కూడబెట్టారని పుట్టా మధుపై ఆరోపణలు
హైదరాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి): కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అక్రమాస్తుల కేసు తరహాలోనే మరోనేత విూద కూడా అక్రమాస్తుల ఆరోపణలు బయటకు వచ్చాయి. అయితే ఈసారి టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఈ ఆరోపణలు వచ్చాయి. ఆయన రూ.900 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టారంటూ సీబీఐ, ఐటీ, ఈడీ విభాగాలకు ఫిర్యాదులు అందాయి. పుట్టామధు జూబ్లిహిల్స్‌లో సినీ నటుడు శ్రీహరి ఇంటి పక్కనే 5 కోట్ల విలువ చేసే ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. అలాగే తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లు వసూళ్లు చేశారని పుట్టామధుపై ఆరోపణలు వచ్చాయి. పుట్టా మధు, అతడి కుటుంబసభ్యులు భారీగా అక్రమాలకు పాల్పడి వందలకోట్ల ఆస్తులు సంపాదించారంటూ ఐటీ, సీబీఐ అధికారులకు మందనికి చెందిన ఉపసర్పంచ్ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అయితే న్యాయవాది రామారావు ఫిర్యాదుపై రేవంత్ ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు పుట్టామధు విషయంలో ఎలా వ్యవహారిస్తానేది చర్చనీయాంశంగా మారింది.