మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు
పెగడపల్లి తేది: 05( జనం సాక్షి ) పెగడపల్లి మండలం
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలోని
మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాదిగ (మాదిగ) ఉపకులాలకు రావల్సిన న్యాయమైన వాటాను ఎస్సిలందరికి జనాభా దామాషా ప్రకారంగా పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎస్సి ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏబిసిడి వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా లేఖ రాయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది దేశవ్యాప్తంగా షెడ్యూల్ క్యాస్ట్ మీద అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది ఆ సిఫార్స్ ఆధారంగా చేసుకొని పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్ క్యాస్ట్ బిల్లును ప్రవేశ పెట్టాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు శ్రీరాం అంజయ్య,బొమ్మేన దయాకర్,మాజీ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బాలే రాజయ్య,ఎంఎస్ఎఫ్ మండల ఇంచార్జ్ నలువాల వినోద్,మండల నాయకులు గసికంటి గోపాల్,కొత్తూరి రవికుమార్,తడగొండ మధు,దీకొండ నరేందర్,సుంకే నవీన్,బీడుదుల నరేష్,రాచర్ల రమేష్,తదితరులు పాల్గొన్నారు.