మందకృష్ణ మాదిగ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.

అచ్చంపేట ఆర్సీ, 28 జులై, (జనం సాక్షి న్యూస్ ) : పట్టణంలోని బాబు జాగ్జీవన్ రామ్ భవనంలో ఎమ్మార్పిఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మార్పియిస్ జిల్లా కన్వీనర్ సౌట కాశీo మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 28 సంవత్సరాలనుండి పోరాటం చేస్తున్న ఎమ్మార్పియిస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పై కొందరు దళిత నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు అయిదు మంది జడ్జిలతో ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, అంబేద్కర్ ఇల్లు రాజాగృహం పై దాడి, దళితులు, వెనుకబడిన వర్గాల మహిళల అత్యాచారాల పై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఎమ్మార్పియిస్ అని అన్నారు. దళితులు అణగారిన వర్గాల సమస్యల పై పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ పై అసత్యఆరోపణలు సహించేది లేదని అన్నారు.కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహేష్, ఎమ్మార్పియిస్ తాలూక ఇంచార్జి బాలస్వామి, మండల ఇంచార్జి ప్రవీణ్, వివిధ మండలాల ఇంచార్జి లు వెంకటేష్, జగదీష్, ఎంఎస్ఎఫ్ తాలూక ఇంచార్జి పవన్, కో ఇంచార్జి కుమార్,ఎమ్మార్పియిస్ జిల్లా కార్యదర్శి రాం ప్రసాద్, నాయకులు పరుశురాం,సోమలింగం,శివ,అంజి, భాస్కర్, పరమేష్, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు