మందు చికెన్ ఇస్తేనే హమాలీలు వడ్లు తూకం వేస్తున్నారు

రుద్రంగి అక్టోబర్ 20 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో రైతులు గురువారం తాసిల్దార్ భాస్కర్ కు వినపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. బుధవారం ఏఐటీయూసీ
జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు రుద్రంగి హమాలీలతో కలిసి తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు.రైతులను పట్టుకొని దళారులు రాజకీయ నాయకులు అని మాట్లాడడం సరికాదని అన్నారు. కడారి రాములు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.స్థానిక హమాలీలు మందు బాటిల్ చికెన్ టిఫిన్ ఇస్తేనే వడ్లు తూకం వేస్తున్నారని అన్నారు.కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.మ్యాచర్ వచ్చి సీరియల్లో ఉన్న వడ్లను తూకం వేయకుండా మద్యం బాటిళ్లు ఇచ్చిన వ్యక్తుల వడ్లను జోకుతున్నారని ఆరోపించారు.ఇట్టి విషయంపై హమాలీలతో మాట్లాడం జరిగిందని వారు వినకపోవడంతో యూపీ బీహార్ నుండి హమాలీలను తెప్పిస్తున్నామని అన్నారు.
చుట్టూ పక్కా గ్రామాల్లో బస్తకి 38 నుండి 40 రూపాయలు ఉంటే రుద్రంగి లో మాత్రం 42 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు.
స్థానిక హమాలీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే యూపీ బీహార్ కూలీలను రప్పిస్తున్నట్టు రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తూర్పు వాడ రైతుల ఐక్య సంఘం అధ్యక్షుడు బోయిని చంద్రయ్య,ప్రధాన కార్యదర్శి దయ్యాల కమలాకర్, ఉపాధ్యక్షుడు గడ్డం మహేందర్,పాల నర్సయ్య,కార్యదర్శులు తర్రె లింగం,గజ నర్సయ్య,దయ్యాల శంకర్,అరిపెళ్లి నర్సయ్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.