మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మినీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలి.

 హైదరాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి అందించిన మున్సిపల్ చైర్మన్, సభ్యులు
మక్తల్, అక్టోబర్ 15, (జనంసాక్షి )
నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో మినీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలంటూ శనివారం మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ పావని మల్లికార్జున్, వైస్ చైర్ పర్సన్ అఖిల రాజశేఖర్ రెడ్డి ల ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఆర్ టి సి రీజినల్ మేనేజర్ను కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బాల్ చెడ్ పావని మల్లికార్జున్ మాట్లాడుతూ మక్తల్ పట్టణం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంటూ 2018 సంవత్సరంలో అప్గ్రేడ్ అయ్యి మున్సిపాలిటీగా మారడం జరిగిందని చైర్ పర్సన్ పావని మల్లికార్జున్ అన్నారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలో కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊటుకూరుకు సంబంధించిన ఐదు మండలాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మక్తల్ పట్టణానికి నారాయణపేట ఆర్టీసీ డిపో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుండి కృష్ణ మండలంలో దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక బార్డర్ లో గ్రామాల్లో ఉండడం తోటి ఎలాంటి బస్సు సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు చైర్ పర్సన్ పావని మల్లికార్జున్ తెలియజేశారు.30 కిలోమీటర్ల దూరంలో నారాయణపేట డిపో వుండటము తోటి ప్రతి చిన్న విషయానికి బస్సులలో వెళ్లాలంటే నారాయణపేట కి వెళ్ళవలసి ఉంటుంది అని ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని వారు తెలిపారు. అలాగే మక్తల్ ఆర్టీసీ బస్టాండ్ నుండి దాదాపు రూ.5 లక్షల నుండి, రూ. లక్షల వరకు ఆర్టీసీ సంస్థకు ఆదాయం ఉందని చైర్పర్సన్ తెలియజేశారు. మక్తల్ పట్టణ కేంద్రంగా మినీ ఆర్టీసీ డిపో ను ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం నుండి కృష్ణ మండలం మాగనూర్, నర్వ మండలాల్లోని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతూ ప్రజలకు ఇబ్బందులను తొలగించడం జరుగుతుందని సంబంధిత ఆర్టీసీ అధికారులకు తెలియజేశారు. మక్తల్ పట్టణం 167వ జాతీయ రహదారిపై ఉండటము తోటి నిత్యము ఈ ప్రాంతము ప్రయాణానికి ఎంతో సౌలభ్యంగా ఉండడం తోటి ప్రజలు అనునిత్యం మక్తల్ పట్టణానికి వచ్చి వెళుతుంటాడు అని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విధిగా నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో మినీ ఆర్ టి సి బస్ డిపో ను ఏర్పాటు చేయాలని కోరడమైనది.