మతిభ్రమించిన యెడ్యూరప్ప

కాంగ్రెస్‌దే తిరిగి అధికారమన్న సిద్దరామయ్య
బెంగళూరు,మే12(జ‌నం సాక్షి ):  కర్ణాటకలో భాజపా అధికారం చేపట్టడం ఖాయమని, ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చేసిన ప్రకటనపై సిఎం సిద్దరామయ్య మండిపడ్డారు. యెడ్డీ  వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు. ‘మే 17 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాను’ అని మాట్లాడటం చూస్తుంటే యడ్యూరప్పకు మతి భ్రమించిందేమోనని అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా 140-150 స్థానాలు గెలుచుకుంటుందని, తాను 50వేల మెజార్టీతో గెలుపొందుతానని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి విజయఢంకా మోగించనుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ మోజారిటీ స్థానాలు దక్కించుకుని తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 120కి పైగా సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని అన్నారు. యెడ్యూరప్ప ఓటమి తప్పదని తీవ్ర కలవరంతో ఉన్నారని, అమిత్‌షా కామెడీ షో, నరేంద్ర మోదీ ఇమేజ్‌ కూడా ఈ ఎన్నికల్లో మసకబారిపోయినట్టు చెప్పారు. మోదీ ప్రసంగాల్లో పసలేకుండా పోయిందని, ఓటర్లపై ఆ ప్రభావం ఎంతమాత్రం ఉండదని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం జేడీఎస్‌ చాలా డబ్బు పంచిందని, సొసైటీ సెక్రటరీనని చెప్పుకున్న ఆ పార్టీ అభ్యర్థికి అంత డబ్బులు ఎలా వచ్చాయని సీఎం ప్రశ్నించారు. బీజేపీ బహిరంగంగానే జేడీఎస్‌కు మద్దతు ప్రకటించిందని, చాముండేశ్వరిలో డవ్మిూ అభ్యర్థిని బీజేపీ నిలబెట్టిందని
తప్పుపట్టారు.