మత్యకారులకు సొసైటీ గుర్తింపు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే..

గద్వాల రూరల్ ఆగస్టు 02 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స్యకారుల సంఘం గద్వాల మండలం మేళచెరువు , గట్టు మండలం ఇందువాసి గ్రామాలకు చెందిన మత్స్యకారుల నూతనంగా ఏర్పాటైన సొసైటీ లకు సర్టిఫికెట్ల ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన మత్స్యకారుల ఎమ్మెల్యే ను శాలువా, పూలదండ తో ఘనంగా సత్కరించారు..ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులకు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. మత్స్యకారుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మోటార్ వాహనాలు, మత్స్యకారుడు ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మత్స్యకారులు ప్రతి ఒక్కరి సొసైటీలో సభ్యత్వాన్ని చేయాలని జిల్లా అధికారి సూచించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ ఎంపీపీలు విజయ్ కుమార్, ప్రతాప్ గౌడ్. జెడ్పిటిసి రాజశేఖర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సంజీవులు, సర్పంచ్ వాసు గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, జిల్లా మత్స్యకారుల శాఖ అధికారి రూపేందర్ సింగ్, ఉపాధ్యక్షుడు ధర్మనాయుడు తెరాస పార్టీ నాయకులు జంబు రామన్ గౌడ్, రాజు మత్స్యకారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.