మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట. ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్.
తొర్రూరు 16 అక్టోబర్ (జనంసాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్సకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని తొర్రూరు ఎంపీపీ చిన్న అంజయ్య, మహబూబాబాద్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ తొర్రూరు జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేసిన లక్ష చేప పిల్లలను ఆదివారం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని పెద్ద చెరువులో ముదిరాజ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వదలడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ,జడ్పిటిసి మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి సంవత్సరం ఉచిత చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అమ్మాపురం గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య ఎంపీటీసీ1 డొనక ఉప్పలయ్య ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు కొత్తూరు రమేష్, ముదిరాజ్ కమిటీ పెద్దలు కొత్తూరు బ్రహ్మయ్య, గుంటుక బిక్షం, గుంటుక యాకయ్య, పాక బ్రహ్మం, కొత్తూరు బాలయ్య, కాగు యాకయ్య, కొత్తూరు కుమార్, గుంటుక ముత్తయ్య, గుంటుక రవి, గుంటుక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.