మదర్ థెరిస్సాకు అపూర్వగౌరవం
– సెయింట్ హోదా
వాటికనసిటీ,సెప్టెంబర్ 3(జనంసాక్షి): ఇక వివాదాలకు తావు లేదు… వ్యతిరేకించేవాళ్లు వ్యతిరేకిస్తునే ఉంటారు… విమర్శించే విూడియా విమర్శలు గుప్పిస్తునే ఉంటుంది.. అయితే ఎవరు అవునన్నా, కాదన్నా వాటికన్ సిటీ మాత్రం ఏడాది క్రితమే నిర్ణయం తీసుకుంది. సేవామూర్తి, కరుణామయి మదర్ థెరిసాకు సెయింట్ ¬దా ఇవ్వాలని.. ఎప్పుడో మొదలెట్టిన ఆ పనిని ఇప్పుడు పూర్తి చేసింది. ఇప్పుడు మదర్ థెరిసా సెయింట్ మదర్ థెరిసా. ఏడాది క్రితమే సెయింట్‌గా గుర్తించిన వాటికన్ సిటీ ఆదివారం అధికారికంగా సెయింట్ ¬దా ప్రకటించింది. జీవిత కాలం అన్నార్థుల సేవలో తరించిన మానవతా మూర్తిని మహిమాన్విత మూర్తిగా వాటికన్ సిటీ గుర్తించింది. భారత దేశాన్ని తన సేవాస్థలిగా ఎంచుకుని లక్షలాదిమంది అభాగ్యుల పాలిట అమ్మగా నిలిచిన మదర్ థెరిసా ఇక అందరి దేవత. జీవించి ఉన్నప్పుడే రోగులు, పేదల పాలిట దేవతగా నిలిచిన థెరిసా మరణానంతరం చూపిన అద్భుతాల కారణంగా వాటికన్ సిటి సెయింట్ ¬దా ప్రకటించింది. ఆమె చూపించిన మహిమల్ని అన్ని రకాలుగా పరీక్షించి నిర్ధారణ చేసుకున్న వాటికన్ సిటీ మతగురువుల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మానవతామూర్తి మదర్ థెరిసాకు మహాగౌరవం దక్కింది. ఆదివారం వాటికన్ నగరంలో మతగురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్ ఫ్రాన్సిస్ మదర్ థెరిసాకు ‘సెయింట్’¬దా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది థెరిసా అభిమానులు తరలివచ్చారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ సుపీరియల్ జనరల్ సిస్టర్ మేరీ ప్రేమ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా నన్స్ కూడా పాల్గొన్నారు.మదర్ థెరిసా 45 సంవత్సరాల పాటు పేదలు, రోగులకు సేవలందించారు. మదర్ థెరిసాకు సెయింట్ ¬దా కోసం వాటికన్ రెండు మహిమలను గుర్తించింది. 2002లో తొలిసారిగా మహిమను అధికారికంగా గుర్తించింది. 1998లో థెరిసా సేవల వల్ల పొట్టలో కణతితో బాధపడుతున్న బెంగాళీ గిరిజన మహిళకు నయమైనట్టు వాటికన్ గుర్తించింది. మదర్ ప్రార్థనల ఫలితంగా బ్రెజిల్‌లో ఒ వ్యక్తి అద్బుత రీతిలో కోలుకున్నట్టు గుర్తించింది. ఇంతటి మహిమాన్వితంగల మదర్ రోగులకు, పేదలకు 45 ఏళ్లపాటు సేవలందించారు. సెయింట్ హుడ్ అంటే పరమ పవిత్రులని అర్థం. ధర్మ బద్ధమైన జీవితాన్ని గడిపినవాళ్లు. పరమ పావనురాలైన మదర్ థెరిసా ఇప్పుడీ సెయింట్ హుడ్ సత్కారాన్ని అందుకున్నారు.మదర్ థెరిసా 1910 ఆగస్టు 26న జన్మించారు. ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోక్సా బోజాక్సియు. 18 ఏళ్ల వయసులోనే ఆమె క్యాథలిక్‌లో చేరారు. 1931లో కోల్‌కతాలో సెయింట్ మేరీస్ స్కూల్‌లో టీచర్‌గా చేరారు. 1931 నుంచి 1948 వరకు కోల్‌కతాలో విద్యా బోధన చేశారు. 1950 మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రారంభించారు. 1952లో కోల్‌కతాలో నిర్మల్ హృదయ్ ప్రారంభించారు. 1955లో నిర్మల శిశు భవన్ ప్రారంభించారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1980లో భారతరత్నను ఇచ్చి సత్కరించింది. 1962లో ఆమె రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 1979లో ఆమెకు శాంతి విభాగంలో నోబుల్ శాంతిబహుమానం ఇచ్చింది.
మదర్ ధెరిసాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇచ్చారు. ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, ఢిల్లీ, బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా థెరిసా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నిర్యాణం తర్వాత ఎవరైనా మదర్, ఫాదర్‌లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు.
థెరిసా గురించి క్లుప్తంగా..
జననం: 1910 ఆగస్టు 26
జన్మస్థలం: మెసడోనియా రాజధాని స్కోప్జె
తల్లిదండ్రులు: నికోలా బొజాక్షియు, డ్రేన్
అసలు పేరు: ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు
థెరిసాగా పేరు మార్పు: 1929లో భారత్‌కు వచ్చాక
ఉద్యోగం: కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలు
సొంత చారిటీ సంస్థ: ద మిషనరీస్ ఆఫ్ చారిటీ-1950 అక్టోబర్ 7న ప్రారంభం
పురస్కారాలు: మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారత రత్న (1980)
మరణం: కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5