మద్యం అమ్మకాు ఆపండి` మద్రాసు హైకోర్టు

చెన్నై,మే 8(జనంసాక్షి): మద్యం కొనుగోు చేసేందుకు ప్రజు క్యూ కడుతున్న నేపథ్యంలో ఆ దుకాణాల్ని మూసేయాని మద్రాసు హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసు సంఖ్య పెరుగుతుండటం, దుకాణా వద్ద ప్రజు భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాు నిర్వహించేందుకు అనుమతించింది. తమిళనాడులో గురువారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో రూ. 172.59 కోట్ల మివైన మద్యం అమ్మకాు జరిగినట్లు టీఏఎస్‌ఎమ్‌ఏసీ (తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పోరేషన్‌ ) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,146 మద్యం దుకాణాు ఉండగా వాటిలో 3,750 దుకాణాు మాత్రమే తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర రోజువారీ మద్యం అమ్మకాు జరిగేవని…. దీపావళి, పొంగల్‌ (సంక్రాంతి) పండుగు, న్యూ ఇయర్‌ రోజుల్లో మాత్రం రూ.120 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు మద్యం అమ్మకాు జరిగేవని అక్కడి అధికాయి తెపారు. అయితే సాధారణ రోజులో ఇంత పెద్ద మొత్తంలో అమ్మకాు జరగడం మాత్రం ఇదే తొలిసారి అని రాష్ట్ర మార్కెటింట్‌ శాఖ వర్గాు వ్లెడిరచాయి. తమిళనాడు రాష్ట్ర ఆదాయంలో టీఏఎస్‌ఎమ్‌ఏసీ అధిక ఆదాయాన్ని అందిస్తుంది.