మద్యం దుకాణాలపై వ్యాపారుల ఆసక్తి

లాభాలు వస్తాయన్న భావనలో ఎదురుచూపు
కామారెడ్డి,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  మద్యం దుకాణాల టెండర్లకు గడువు సవిూపిస్తుండడంతో జిల్లాలో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు.  జిల్లాలో
మద్యం లైసెన్సును చేజిక్కించుకునేందుకు భారీ పోటీ ఏర్పడనుంది. జిల్లాలో రెండేండ్ల కిందట జరిగిన వేలంలో 38 లైసెన్సులను దక్కించుకునేందుకు 450 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు చెల్లించారు. ఈ లెక్కన ఆశావహుల దరఖాస్తు రు సుము ద్వారా సర్కారుకు రూ.4.50 కోట్లు ఆదా యం చేకూరింది.ఆబ్కారీ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరుతో వైన్‌ షాపుల లైసెన్సుల గడువు ముగుస్తుండగా అక్టోబర్‌ ఒకటో తారీఖు నుంచి కొత్త లైసెన్సు విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు త్వరలోనే కొత్త లైసెన్సుల నోటిఫికేషన్‌ జారీ కానుంది. రెండేండ్లలో జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. 38 మద్యం దుకాణాల్లో మొత్తం రూ.600 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్‌ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మద్యం పాలసీ గడువు సవిూపిస్తుండగా నోటిఫికేషన్‌ ఎప్పుడు వి డుదలవుతుందోనని మద్యం వ్యాపారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. పాలసీ విధానంలోని అంశాలపై ఆశావహుల్లో ఆసక్తి ఏర్పడింది. గత పాలసీలో జిల్లా కేంద్రంలోని దుకాణాలకు లైసెన్సు ఫీ జు రూ.55 లక్షలు, గ్రావిూణ ప్రాంతాల్లో రూ.45 లక్షలు చెల్లించే విధానం ఉండగా ఈ సారి కొంత మొత్తం పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి.నూతన మద్యం పాలసీలో భారీ మార్పులు జరగబోతున్నాయని
ప్రచారం సాగుతున్నది. 2017కు ముందు లైసెన్సు ఫీజుకు అదనంగా పర్మిట్‌ రూమ్‌కు రూ.లక్ష తీసుకునే విధానం ఉండగా ఇప్పుడు లైసెన్సు ఫీజులోనే కలిపారు. కొత్త విధానంలో పర్మిట్‌ రూమ్‌ ఉంటుందా? లేదంటే సపరేటుగా ఫీజు వసూలు చేసి అనుమతులు ఇస్తారా? అన్న ది తేలాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు, లైసెన్సు రుసుము పెంచే అవకాశాన్ని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
జిల్లాల పునర్విభజన అనంతరం జరిగిన గత పాలసీలో పలు కొత్త మండలాలకు వైన్‌ షాపులు కేటాయించలేదు. ఈ సారి వీటి సంఖ్య పెరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం
మాత్రం కొత్త దుకాణాల పెంపుపై ఆస క్తి చూపడం లేదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధి భారీగా విస్తరించింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాలు సైతం మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. వీటిలో పలు గ్రామాలను విలీనం చేయడం ద్వారా మద్యం దుకాణాల సంఖ్య పెరుగుతుందేమోనని ఆశావహు లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం పాలసీ 2017, అక్టోబర్‌ 1వ తారీఖున మొదలైంది. గత పాలసీకి గడువు సెప్టెంబర్‌ 30వ తేదీకి ముగిసి మరునాటి నుంచే కొత్త పాల సీ అమల్లోకి వస్తుంది.