మద్యం మత్తులో కుటుంబసభ్యులపై గొడ్డలితో దాడి: ముగ్గురి పరిస్థితి విషమం
వరంగల్ : ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పై గొడ్డలితో దాడికి దిగాడు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి, అక్కలపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.