మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దు

*సాయుధ దళ డి.ఎస్.పి ఇమ్మానియేల్ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్*
గద్వాల అర్ సి (జనంసాక్షి) ఆగస్ట్ 5,
జోగులాంబ గద్వాలలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం లో ప్రతిజ్ఞ చేయిస్తున్న ట్రాఫిక్ ఎస్ ఐ. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ శిక్షణ భాగంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 25 మందికి సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు నియమ నిబంధనలు అతిక్రమించడం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయని తెలియజేశారు. కావున వాహనదారులు తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ను ధరించి తమ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ను సంబంధ పత్రాలను ఉంచుకొవలంటు సూచించారు. త్రిబుల్ రైడింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించకుండా, డ్రంక్ & డ్రైవ్ ఓవర్ లోడ్ ,ప్యాసింజర్స్ సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ సీట్ బెల్ట్ లను గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఎక్కువ శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయని అవగాహన సదస్సులో వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు రమేష్ జి బలరాం గోపాల్ పాల్గొన్నారు.