మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు

 

 

 

 

 

 

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(జనం సాక్షి) హుజూర్ నగర్ పట్టణంలో సిఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 40 మంది సిబ్బందితో కలిసి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను, డ్రంక్ అండ్ డ్రైవ్, పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ రామలింగారెడ్డి మాట్లాడుతూ వాహన దారులు నియమ నిబంధనలు పాటించాలనీ, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి నంబర్ ప్లేట్లు కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తారని తెలిపారు. ఈ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై 4 డిడి లు, పది టౌన్ న్యూసెన్స్ ఆక్ట్స్, ఓపెన్ ఏరియా బుకింగ్ నాలుగు కేసులు నమోదు చేశారాని తెలిపారు. ఈ తనిఖీల్లో హుజూర్ నగర్ ఎస్సై వెంకటరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.