మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం

అధికారులపర్యవేక్షణ కరువు

మల్దకల్ జూలై 29 (జనంసాక్షి) మండల పరిధిలోని విఠలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులు
ప్రతిరోజు పురుగుల అన్నం పురుగులను పక్కకు వేసి తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులుహలీం పాషా,కార్యదర్శి హరీష్ ఆరోపించారు.శుక్రవారం పాఠశాలను సందర్శించితనిఖీ చేయగా ప్రతిరోజు పురుగుల అన్నంతో తింటున్నామని, అందుకే మా ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తున్నామని విద్యార్థులు ఆరోపించారు.పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం తనిఖీ చేయడం జరిగింది.భోజనంలో పురుగులు దర్శనం ఇవ్వడం జరిగింది నీలచారు, ప్రతి రోజు ఉడికిన ఉడకని పప్పు ప్రతిరోజు తినడం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలఉపాధ్యాయునికి విద్యార్థులు చెప్పిన ఏమీ పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోయారు.
150 మంది విద్యార్థులు ఉన్న దాదాపు 50 మంది విద్యార్థులు టిఫిన్ బాక్సులు తీసుకురావడం జరుగుతుంది.మండల,జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీలు చేయకుండా ఉన్నందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు కాకుండా చూసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో మహేష్, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు