మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లిపడిన ఆహారం తినడమే దీనికి కారణమని తెలిసింది. బాధితులను సఖినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.