మనఊరు మనబడి పనులు త్వరితగతిన పూర్తిచేయండి : కలెక్టర్ శ్రీ హర్ష

జోగులాంబ గద్వాల   (జనంసాక్షి) ఆగస్టు 5 :

ఆగస్టు 15 లోపు సబ్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు పంచాయతీరాజ్ డి ఈ ఈ, ఇ ఇ లు, ఏ ఈ, లతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ హెల్త్ సబ్ సెంటర్ కుల పనులు ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా లో మన ఊరు మన బడి కింద ఎంపికైన పాఠశాల పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు జిల్లాలోని గుర్తించిన ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్తు పనులు ఫ్లోరింగ్ డైనింగ్ హాల్ పనులకు సంబందించిన తదితర పనులు త్వరలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మైనర్ రిపేరు పనులు, పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి, పనులు పూర్తి అయ్యేలా చూడాలని, ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్తుల విద్యా బోధన విధానం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పాఠశాలలలో చేపట్టే అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు, నిర్వహణ కమిటీ చైర్మన్, ఇంజనీరింగ్ విభాగం ఏఈ, భాగస్వాములై పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని అన్నారు. మండలం వారిగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ సెంటర్ల నిర్మాణ పనులపై సమీక్షించారు.
సమావేశం లో పంచాయతి రాజ్ ఇ ఇ సమత, , డి ఈ ఈ, ఇ ఇ లు ఎ ఈ లు తదితరులు పాల్గొన్నారు.