‘మనగుడి’ సంబరాలు ప్రారంభం

శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాలో మనగుడి సంబరాలు ప్రారంభమయ్యాయి. మనగుడి పిలుస్తోంది పేరిట శ్రావణ పౌర్ణమి సంబరాలను జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోనూ ఎంపిక చేసిన దేవాలయాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయాన్నే ఆరు గంటల నుంచి దేవాలయాల్లో అభిషేక పూజా కార్యక్రమాలు జరిపి 10 గంటల వరకు కొనసాగించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగే కార్యక్రమంలో సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరపబోతున్నారు. కాగా ఈ కార్యక్రమాలు దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ ఆండ్ల వీరవెంకట సత్యనారాయణమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన ప్రత్యేకాధికారి బాలరాజ్‌ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆలయాల్లో జరుగుతున్న ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వీరిలో అత్యదికులు మహిళలే ఉన్నారు.

తాజావార్తలు