.బీహార్‌లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్‌..

` భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన..దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు. ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిరచింది. రాహుల్‌ మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదని తెలిపింది. అసలేం జరిగిదంటే..? బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ నేడు విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘’రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడిరది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్‌ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు’’ అని కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపించారు. భాజపా కోసమే ఈసీ ఈ ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్‌ మండిపడ్డారు. ‘’ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్‌ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం’’ అని విపక్ష నేత హెచ్చరించారు.
ఆ మాటలు పట్టించుకోవద్దు: ఈసీ
ఇదిలా ఉండగా.. ఓట్ల చౌర్యంపై రాహుల్‌తో పాటు విపక్షాలు చేస్తోన్న ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండిరచింది. అవన్నీ నిరాధార ఆరోపణలేనని తేల్చిచెప్పింది. ఇలా రోజూ వచ్చే బెదిరింపులను తాము పట్టించుకోబోమని తెలిపింది. రాహుల్‌ లాంటి వారు చేస్తోన్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదని తమ అధికారులకు చెప్పామని ఈసీ స్పష్టం చేసింది. పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణలను విస్మరించాలని అధికారులకు సూచించింది.

 

వెబ్‌సైట్‌లో బీహార్‌ముసాయిదా ఓటర్ల జాబితా
` అందుబాటులో ఉంచిన ఈసీ
` సంబంధిత అధికారుల వద్ద అభ్యంతరాల పరిశీలన
న్యూఢల్లీి(జనంసాక్షి):బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం శుక్రవారం ప్రచురించింది. ఓటర్లు ఇసిఐ వెబ్‌సైట్‌లో వారిపేర్లను తనిఖీ చేసుకోవచ్చు. ఇసిఐ జాబితా ప్రకారం.. జూన్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కావడానికి ముందు బీహార్‌లో 7.93 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అయితే తాజాగా విడుదలై ముసాయిదా జాబితాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలియాల్సి వుంది. ముసాయిదా జాబితా ప్రచురణతో పాటు- ’ క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల’ పక్రియ కూడా ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్‌ 1 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ముసాయిదాలో పేర్లను తప్పుగా తొలగించారనే ఫిర్యాదులు ఉన్నవారు సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇసిఐ బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఇటీవల రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ పక్రియ అనంతరం ఓటరు ముసాయిదా జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. దీన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ ముసాయిదా జాబితాలో చేర్చిన వివరాలు ఇంకా వెబ్‌సైట్‌లో పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కానీ, ఓటర్లు ఈసీ వెబ్‌సైట్‌లో తమ పేర్లను చెక్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడిరచారు. ఈ జాబితాలో సవరణలకు నెల రోజులు అంటే సెప్టెంబరు 1 వరకు గడువు కల్పించారు. అర్హులైన వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడానికి, అనర్హులుగా భావించినవారి పేర్లను తొలగించడానికి పౌరులు, రాజకీయ పార్టీలు ఈలోగా ప్రతిపాదనలు చేయొచ్చని అధికారులు స్పష్టంచేశారు. ముసాయిదా జాబితాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.. గుర్తింపు పొందిన పార్టీలకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు రాష్ట్రంలో 7.93 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సవరణ చేపట్టగా.. కీలక విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షల మంది ఇతర నియోజక వర్గాలకు మారినట్లు- ఈసీ తెలిపింది. మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండుచోట్ల ఓటు- నమోదు చేసుకున్నట్లు- అధికారుల పరిశీలనలో తేలింది. అయితే, ఈ సమగ్ర సవరణను కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారని దుయ్యబట్టాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం వద్ద పెండిరగ్‌లో ఉంది.