మన తెలంగాణ విలేకరి పై పారెస్టు అధికారుల దాడిని ఖండించిన గంగారం ఎంపీపీ

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి)
గంగారం మండలం పుట్టాలభూపతి సొలం బాబు ని తీవ్రంగా కొట్టి మంచి నీళ్లు అడుగుతే మూత్రం పోసిన సంఘటన మరువకముందే చింతగూడెం గ్రామములో మన తెలంగాణ విలేఖరి పల్లె సురేష్ పై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమైనా మాట్లాడితే సమరహస్యంగా మాట్లాడాలి కాని ఒక విలేఖరి అని చూడకుండా పారెస్టు అధికారిగా ఏమి చేసిన నడుస్తాది అని అంకారం తో ఎవరిని ఏమిచేసినా అధికారం బలం తో రైతులను విలేఖరులను ఇష్టమొంచినట్లు మాట్లాడుతు దాడి చేస్తున్నారు. విలేఖరి పై దాడి చేసిన బిట్ అధికారి పై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు.
నిరుపేద ఆదివాసి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం అర్హులందరికీ గంగారం మండలం లో సర్వే జరిపి ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, అటవీ శాఖఅధికారులు పారదర్శకంగా పోడు చేసుకున్న సాగుదారులకు దరఖాస్తులు చేసున్నవారికి హక్కు పత్రాలు (పట్టాలు) ఇచ్చేందుకు ముందుకు వచ్చిందాన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు గిరిజనులు సాగుచేస్తున్న భూముల జాబితాను రూపొందించి కలెక్టర్ గారికి నివేదిక సమర్పంచాలని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు గ్రామాల వారీగా సర్వే సిబ్బందికి పోడు భూముల సర్వే దరఖాస్తుల గురించి గిరిజనులకు అవసరమైనా సూచనలు సలహాలు ఇవ్వాలని గంగారం మండల ప్రజపరిషత్ అధ్యక్షులు సువర్ణపాక సరోజన వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర అన్నారు.