మన హక్కుల్ని మనం కాపాడుకుంటూనే,ఎదుటివారి హక్కుల్ని కాపాడడమే చట్టం

 

నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు 26(జనంసాక్షి)

చట్టం అంటే మన హక్కులను మనం కాపాడుకుంటూనే,ఎదుటివారి హక్కుల్ని భంగం కల్పించకుండా ఉండడమే చట్టం అని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు అన్నారు.ఈనెల24వ,25వ,మరియు26వ తేదీల్లో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ చట్టాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల మరియు జిల్లా లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జ్ డి.రాజేష్ బాబు హాజరై మాట్లాడుతూ,రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో గత మూడు రోజుల నుండి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించకుండా తల్లిదండ్రుల ప్రాథమిక హక్కులను భంగం కల్పించే కొడుకులు శిక్షార్హులంతారన్నారు.
ఇతరుల నుండి భూములు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా చట్ట పరిధిలోని అంశాలను భూములను కొనుగోలు చేయాలన్నారు.గ్రామాల్లో వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీని వసూలు చేస్తే వడ్డీల నుండి రక్షణ పొందేందుకు చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకొని,అధిక వడ్డీల నుండి రక్షణ పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు.భారత ప్రభుత్వం అమ్మాయిలకు 18సంవత్సరాలు,అబ్బాయిలకు 21 సంవత్సరాల వయసు వచ్చిన తరువాతనే పెళ్లిళ్లు చెయ్యాలని చట్టం చేసిందని,అతిక్రమించి బాల్య వివాహాలు జరిపించే తల్లిదండ్రులపై చట్టపరకారం శిక్షలు ఉంటాయన్నారు.రైతులు విత్తనాలు,క్రిమిసంహారక మందుల కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు.
వాటి వల్ల మోసపోతే నష్టపరిహారాన్ని పొందవచ్చు అన్నారు.
అంతకుముందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కే.స్వరూప,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తి సింహ హాజరైన ప్రజలకు ప్రాథమిక చట్టాలు,హక్కులు,ప్రతి ఒక్కరూ ఎలా చట్టాలను వినియోగించుకోవాలో వివరించారు.ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే.స్వరూప,అడిషనల్ జూనియర్ జడ్జి కీర్తి సింహ,జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,ప్రభుత్వ న్యాయవాది శ్యాంప్రసాద్,ఏజిపీ రామచంద్రయ్య,న్యాయవాదులు తిరుపతయ్య,రాంబాబు,సత్యనారాయణ,జడ్పిటిసి శ్రీశైలం,గ్రామ సర్పంచ్ స్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.