మరణ సమయం తెలినే జన్యుపు

వాషింగ్టన్‌ : మానవుడు ప్రతి రోజూ ఏ సమయంలో నిద్ర నుంచి లేస్తాడు.. ఏ రోజున, ఏ సమయాన మరణిస్తాడు అనే దాన్ని ప్రభావితం చేసే ఒక సాధారణ జన్యువును శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారని సరికొత్త అధ్యయనం పేర్కొంది.
తాజా అధ్యయనం కార్యక్షేత్రంలో పని గంటల ప్రణాళిక, వైద్య చికిత్సల ప్రణాళికతో పాటుగా దుర్బల రోగుల ఆరోగ్య పరిస్థితుల పర్యవేక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది.
” శరీరంలోని  ” జీవన చర్యల ఆవృతిని, లయను నిర్దేశించే సహజ సిద్ధ అంతర్గత ప్రక్రియ ” మానవ శరీరం, ప్రవర్తనకు సంబంధించిన నిద్రించాల్సిన వేళలు, మెరుగైన పనితీరు ప్రదర్శించే వేళలు, అనేక మానసిక ప్రక్రియలు కాలం లాంటి అనేక అంశాలను నియంత్రిస్తుంది. గుండె పోటు, హృద్రోగం లాంటి ఆరోగ్య సమస్యలు సంభవించే సమయంపై కూడా అది ప్రభావం చూపుతుంది” అని టొరొంటో విశ్వవిద్యాలయంలో నాడీ వ్యవస్థ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆండ్రూలిమ్స్‌ వివరించారు.
లిమ్‌, ఆయన సహచరులు వ్యక్తుల జన్యువుల ఆధారంగా నిద్ర లేవటం, నిద్రకు  ఉపక్రమించటంలో వారి ప్రవర్తనను పోల్చి చూశారు. అనంతరం కనుగొన్న అంశాలను యువకులపై బృందంపై పరీక్షించారు.