మరి ముస్లింలు ఎవరు?

కన్నబిడ్డని సవతి కొడుకుగా / చిత్రించింది చరిత్ర

అన్నదమ్ముల్నిచి / నన్ను ఒంటరివాణ్ణి చేసింది చరిత్ర…’

-ఖాదర్‌ మోహియుద్దీన్‌

మన దేశంలో 15 నుంచి 20 కోట్లమంది ముస్లింల మున్నాం .ఆంధ్రద్రేశ్‌లో 90 లక్షలదాకా ఉన్నం. పెద్ద సమూహం ఇవాళ భయంకరమైన సాంఘిక వివక్షకు, దుర్భర దారిద్య్రానికి, అత్యంత నిరాదరణకూ, నిరక్ష్యరాస్యతకూ గురవుతూ వస్తున్నది. అన్నిరంగాల్లో అట్టడుగునపడి కొట్టుమిట్టాడుతున్నది. ఇవాళ 70 శాతం ముస్లింలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, అన్నిరంగాక్ష్ల రెండు, మూడు శాతమో, అంతకన్నా తక్కువో ఉన్నారనీ ఎస్సీ,ఎస్టీల కన్నా, ఇతర మైనారిటీలకన్నా వెనకబడి ఉన్నారనీ ఎన్నో నివేదికలు చెబుతున్నాయి.

మాకు చదువుల్లేవు…ఉద్యోగాల్లేవు…పదవుల్లేవు.. పరిశ్రమల్లేవు. మాకు భూముల్లేవు.ముఖ్యంగా 90 శాతం మందికి ఏ వృత్తులూ లేవు. ఇన్నాళ్లు బీజేపీి. ఆరెస్సెస్‌వాళ్లు మమ్మల్ని భారతీయులు కాదం టూ ప్రచారం చేశారు.ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించిన సంద ర్భంలో కొంతమంది బిసీలు మేం బీసీలు ఎట్లవుతామన్నారు. మరి మేం ఎవరం?

మేం ఈ దేశ మూలవాసులం!

శతాబ్దాల నాడు ఈ దేశంలోని మూలవాసులైన ద్రావిడులమీద ఆధిపత్యం సంపాదించిన ఆర్యులు (బ్రాహ్మణులు, కొన్ని అగ్రకు లాలవాళ్లు) ద్రావిడుల్నంతా అంటరానివాళ్లని చేసి పారేశారు. ముడ ి్డకి తాటాకు కట్టి మీ అడుగుల గుర్తులు కూడా కనబడొద్దన్నారు. మూతికి ముంత కట్టి మీ ఉమ్మి కూడా నేలమీద పడొద్దన్నారు. ఊరి కి,కాటికీ, ఆఖరికి మంచి నీళ్లకూ దూరం చేశారు. వాళ్లొస్తుంటే చెప్పులు విడిచి చేత పట్టుకొని పక్కకు నిలబడాలి.తలకు రుమాల ఉంటే తీసిపట్టుకోవాలి. బడికీ,గుడికీ కూడా అంటరానివాళ్లను చేశారు. అలాంటి ఎన్నో అవమానాలు, హింస అనుభవిస్తూ వచ్చిన ఎంతో కాలానికి సూఫీ ప్రవక్తలు వచ్చి మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. వాడు అసుంట అసుంట అంటే సూఫీలు మాకు అలాయిబలాయి ఇచ్చారు. మా గుండెకు గుండెను కలిపారు. మేము తాగిన గిలాసుల్లో వాళ్లు నీళ్లు తాగారు. మాతోపాటు కూచొని బువ్వ తిన్నారు. అగ్రహారాల వీధుల నుంచి మా శవాల్ని కూడా తీసుకెళ నివ్వని దుష్ట సంస్కృతిని బద్దలు చూస్తూ మా వాళ్ళ శవానికి వాళ్లు భుజం పట్టారు. మేం మజీదుకు వెళ్తే భుజం భుజం కలిపి నమాజు చదివించారు, మా గుండెలు చెరవులయ్యాయి.. మా మనసులు సముద్రాలయ్యాయి.. మేం వాళ్లలో ఒకరమైనాం. మాకు కష్టమొస్తే, నష్టమొస్తే వాళ్లు మంచి మాటల్తో మమ్మల్ని ఓదార్చే,ఆదరించే ప్రవ క్తలయ్యారు. మేం అందరం ముసల్మానులమైనాం. మేం ఈ దేశ మూలవాసులం. ద్రావిడులం. మాదిగలం. మాలలం. ఆదివాసీలం. బీసీలం!

మాదిగ వాడలూ తురక బజార్లూ / మురిక్వాల్వల్నీ ‘నీసు కంపు’ల్నీ

ఒక్కలాగే మోస్తుంటాయ్‌ / వాని గుడిసెలో ఎండు తునకలై

మా సాయమాన్లో కవాబులై / దండేనికి వేలాడే ‘ కౌసు వాసన’

మా బంధుత్వాన్ని చెబుతోంది

-స్కైబాబ

మేం మతం మారినవాళ్లం కాము. మాకు మతం లేకుండె. ఈ దేశంలో ఆదివాసీలకు, దళితులకు, బిసీ కులాలకు మతం లేతు. మాకు ఇష్టమై ఇస్లాం స్వీకరించాం. మాలో కొందరు క్రైస్తవం స్వీక రించారు. ఇస్లాం, క్రైస్తవం స్వీకరించకుండా ఉండిపోయిన మా దళి తుల్ని, ఆదివాసీల్ని, బిసీ కులాల్ని ఇవాళ బిజెపి, ఆరెస్సెస్‌ ‘హిందూ వుల’ంటున్నియి.మేం హిందువులం కామని బిసీల తరపున ప్రొ.కంచ ఐలయ్య పుస్తకం రాశాడు. దళితుల తరఫున దళిత కవులు, మేధా వులు అంటున్నారు. ఇంకా అంటారు. ఇన్నాళ్లు కప్పిపుచ్చిన నిజాల్ని, కుట్రపూరిత ఆరెస్సెస్‌ గోబెల్‌ ప్రచారాల్ని బద్దలు చేస్తారు. రేపటికి రాజ్యానికొస్తారు. స్వాతంత్య్రానికి ముందు అగ్రకులస్తులంతా కలిసి మమ్ముల్ని మైనారిటీలన్నారు. (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళి తులు, ఆదివాసులందర్నీ మైనారిటీలన్నారు. రిజర్వేషన్లనిచ్చారు.) ముస్లింలకు 25 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నాం. ప్రత్యేక నియోజకవర్గాలను కూడా సాధించుకున్నాం. స్వాతంత్య్రం తర్వాత అవన్నీ లేకుంట చేశారు. పాకిస్తాన్‌కన్నా మనదేశంలోనే ముస్లింలం ఎక్కువమందిమున్నాం. మతం మారి ఇస్లాంలో చేరిన బ్రాహ్మణులు, అగ్రకులాలవాళ్లు పాకిస్తాన్‌ పోయారు. ధనిక ముస్లింలంతా పాకిస్తాన్‌ వెళ్లిపోయారు. ఇ్కడున్న మేమంతా దళిత ముస్లింలం. పేద ముస్లింలం. ఈ మటట్టిమీది ప్రేమతో ఈ గడ్డనే హత్తు కుపోయినవాళ్లం. అట్లాంటి మాకు రిజర్వేషన్లు లేకుండా ఎట్లా చేశారు? 57 ఏండ్లు అన్యాయం చేసింది చాలు ! మాకివాళ దక్కాల్సి నంత రిజర్వేషన్‌ ఇవ్వాల్సిందే. మేం ఈ దేశ మూలవాసులం ! మొన్న ద్యుణ్ణి నిన్న చండాలుడ్ని ఇవాళ నా సవాలక్ష గాయాల సాక్షిగా సాయిబుని నిజానికి నేను దళితుణ్ణి -ఖాజా కేవలం 2 నుంచి 3 శాతం ముస్లింలు మాత్రమే ఈ దేశంలో బైటి దేశాల నుంచి వచ్చిన వారు. మిగతా 97 శాతం ఈ దేశ మూలవాసులే. అంటబడనివ్వని కులాలనుంచీ, వెనకవడేయబడ్డ కులాలనుంచీ ఇస్లాం స్వీకరించినవారే. ఈ విషయాన్ని తొక్కిపెట్టి హిందూత్వ వాదులు కుట్ర చేశారు. మమ్మల్ని బైటి దేశస్తులుగా దుష్ప్రచారం చేశారు. దేశద్రోహులుగా, ఐఎస్‌ఐఏజెంట్లుగా ముద్రలు వెయ్యడానికి ప్రయత్నించారు. కానీ ముమంటున్నాం మేం ఈ దేశ మూల వాసులం ! ద్రావిడులం ! ఇరానియన్లను, ఈజిప్షియన్లను, అఫ్ఘ నిస్తానీలను చూడగానే గుర్తుపట్టవచ్చు. నీగ్రోలను తెల్లవాళ్లను గుర్తుపట్టవచ్చు. ఆఖరికి మన ఉపఖండంలోనే ఉన్న నేపా లీలను చూడగానే గుర్తుపట్టవచ్చు. వాళుఓ్ల కూడా మమ్మల్ని చూడగానే ఇండియన్లుగానే గుర్తుపడతారు ! ఎందుకంటే ( ఆంత్రోపాలజీ ప్రకారం) భౌగోళిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఈ భూగోళంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా, భిన్నమైన శరీర నిర్మానాలతో మనుషులున్నారు. అటేఓ్ల మన మంతా ఒక్కలాగే ఉన్నాం. అందుకే ఇక్కడ దళితులూ- మేమూ, బీసీలూ-మేమూ, ఆదివాసీలూ-మేమూ అన్నద మ్ముల్లాగే కనిపిస్తాం. మా ముఖ కవళికలూ, వాళ్ల ముఖాలు (కాపాలాలు, ముక్కులు )ఒక్క తీరుగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్లే మేమైనాం కాబట్టి. అందుకే మేం ఈ దేశ మూలవాసులం. ద్రావిడులం. రండి మాతో.. ఆనవాళ్లు చూపుతం- హైదరాబాద్‌లో దోబీలు (చాకలి) హజామ్‌ (మంగళి), ఖసాబ్‌ (కటిక) సునార్‌ (కంసాలి), బడయ్‌ (వడ్రంగి) తదితర వృత్తులు కొనసాగిస్తున్న ముస్లింలున్నారు. నల్గొండ టౌన్‌లో హైదర్‌ఖాన్‌గూడ, మాన్యంచెల్క, జామ మసీదు, అక్కచెల్మలాంటి ప్రాంతాల్లో సగం మంది ముస్లిం లున్నారు. ఇండ్లన్నీ కలిసిపోయి ఉంటాయి. దాన్ని బట్టి ఎవరు ముస్లింలుగా మారారో అర్థమవుతుంది). నల్గొండ జిల్లా కొప్పోల్‌ దగ్గర ఒక గంట ఫకీరోల్ల గూడెం ఉంది. చీకటితోనే గంట కొడుతూ అడుక్కుంటానికి ఊర్లలోకి వచ్చేవాళ్లు వీల్లు. బహుశా యాచకుల నుంచి ఇస్లాం స్వీకురించినవారు. అన్ని జిల్లాల మారుమూలల్లో ఎలుగుబంటితో ఊర్లలోకి అడుక్కుంటానికి వచ్చే ముస్లింలున్నారు. ఊరూరు తిరుగుతూ కమ్మరి పనిచేసేవారు (లోహార్‌), విగ్రహాలు పోతపోసే ముస్లింలున్నారు. ఖమ్మం పక్కన జింకలోల్లుఉన్నారు. కడప జిల్లాలో గారడి వాళ్లున్నారు. వహిల్వాన్‌ (దొమ్మర?)లున్నారు. వేంపల్లిలో బోరెవాలె (ఈతచాపలు అఏ్లవాళ్లు) 300 ఇండ్లున్నాయి. వీళ్లను బొంతలోల్లు అని మన తెలుగోల్లు పిలుస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ చాపలు వచ్చేశాయి కాబట్టి ఈతచాపలు ఎవరూ కొనడం లేదు. వాళ్లు కుట్టిన చాపలు వాళ్లలో ఎవరైనా చచ్చిపోతే చుట్టి బొందచుట్టి బొందపెట్టడానికి పనికివస్తున్నాయి. వాళ్లిప్పుడు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారు. జిల్లావ్యాప్తంగా వీల్లు న్నారు. వేంపల్లిలోనే ఘోడేవాలె (గుర్రాలోల్లు), లఖ్‌డేవాలె (అడవి లోకెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకునేవాళ్లు)ఉన్నారు. నల్గొండలో ఊర్లకు ఊర్లు కాశోల్లు (ఫత్తర్‌ఫోడ్‌) ఉన్నారు. నల్గొండకు దగ్గర్లోనే కాశివారిగూడెం, కాసారం ఉన్నాయి. వీళ్‌లంతా రాళ్లు కొట్టే ముస్లింలు. రాళ్లు కొట్టడమే తమ పిల్లలకు విద్య, వేరే చదివించలేకపోతున్నామంటున్నారు. మాలల నుంచి పద్మ శాలీలనుంచి ఇస్లాం స్వీకరించి రకరకాల పేర్లతో పిలువ బడుతున్నాయి. దూదేకుల వాళ్ల గురించి చాలావరకు అందరికీ తెలుసు. బీడీలు చుట్టే ఆడవాళ్లు విస్తర్లు కుట్టే ఆడవాళ్లు, మిషన్లు తొక్కే ఆడవాల్లు, కూలినాలికిపోయే ఆడవాళ్లు ఎందరో ఇట్లా ఎన్నో ఉదా హరణలు.. రాజస్తాన్‌లో రోడ్లపై చెప్పులపని, తోలుపని చేస్తున్నారు. బనారస్‌లాంటి చోట్ల బట్టలు వేసే ముస్లింలున్నారు. బీహార్లో పాములు ఆడించే సఫేరాలు ముస్లింలే. ఆదివాసీ దళిత బహుజనుల 60కి పైగా వృత్తుల్లో ముస్లింలు కొనసాగుతున్నారని కొన్ని నివేదికలు చెబుతునా&ఏనయి. దీన్నిబట్టి ఆయా కులాల వాళ్లే ముస్లింలుగా మారారని అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్లను రిజర్వే షన్లకు దూరంగా ఉంచుతున్నారు.

నఘర్‌కా నఘాట్‌కా !

ఇస్లాం స్వీకరించకముందు మాకు కులవృత్తులుండె. అకకడా ఇక్కడా నవాబులు పాలన ఉన్న సమయంలో తమది నవాబుల మతంగా ఫీలయి కొంత, ఆయా వృత్తుల్లో కొనసాదుతున్నవాళ్లను ఇతర బ్రా హ్మణ సమాజం నీచంగా చూస్తుండడం వల్ల మరింత ముస్లింలంతా వృత్తులు వదిలేస్తున్నారు. చిన్నాచితక ఉద్యోగాలు సంపాదించుకు న్నారు. కొంత భూముల్ని పట్టా చేయించుకున్నారు. వ్యవసాయం చేయడానికి, చేయించుకోవడానికి వీళ్లేమీ రెడ్లూ, కమ్మలూ, వెలమల్లాంటివాళ్లు కాకపోవడంతో తరువాత ఆ భూములు రెడ్లు, కమ్మలు, వెలమలే సొంతం చేసుకున్నారు. ఇటు వృత్తులు లేకుండా పోయాయి. అటు భూముల్లేకుండా పోయాయి. రెంట చెడ్డ రేవడి బతుకులయ్యాయి. రోడ్డున పడ్డాయి. ఇవాళ రోడ్ల పక్కన పండ్ల బండ్లన్నీ ముస్లింలవే. రోడ్‌సైడ్‌ మెకానిక్‌లంతా ముస్లింలే. సైకిల్‌ గిల్లల పంక్చర్‌లు బాగుచేసేవాళ్లంతా ముస్లింలే. దర్జీలు, గడియా రాలు బాగుచేసేవాళ్లు, హరేక్‌మాల్‌ బండ్లవాళ్లు, గరం మిర్చిబండ్లు, చాయ్‌ హోటళ్లు, చిన్నచిన్న చెప్పుల షాపులు, టెంట్‌హౌజ్‌లు, చిల్లర బురగాళ్లంతా ముస్లింలే కావడం యాధృచ్ఛికమా? ఆటోవాలాలు, కారు, జీపు, లారీ డ్రైవర్లంతా ముస్లింలే కావడం యాధృచ్ఛికమా? ఇటు చదువుకునే అవకాశాల్లేక అటు ఓసి కావడంతో ఉద్యోగాలు రాక ధోబీ ఘదా న ఘర్‌కా న ఘాట్‌కా బతుకులైపోయాయ్‌..

మేం నవాబులం కాము

మా తాత ముత్తాతలెవరూ నవాబులు కారు. మేం నవాబులం ఎట్లవుతా? 400 ఏండ్లు పరిపాలించినవాళ్లుకు రిజర్వే షన్లెందుకు అంటున్న కొందరి మందబుద్ధిని, సంచుచిత వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. 90 శాతం మందిమి ఇక్కడి మూలవాసుల్నించి ముస్లింలమైన మేము నవాబులం కామని మావి నవాబు వంశాలు కవావని స్పష్టం చేస్తున్నాం.

బీసీ కులాల మిత్రులారా !

బీసీ బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ అన్న విషయం గమనించాలని కోరుతున్నాం. కొందరు బిసి మిత్రులు రక రకాల వ్యాఖ్యలు చేస్నుఆ్నరు. తప్పుడు వ్యాసపాలు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సామాజికంగా, విద్యాపరంగాఆ వెనుకబడి ఉన్నా ఏ కమ్యూనిటీనైనా బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్‌ కల్పించవచ్చు. అలా వెనకబడి ఉన్న కమ్యూనిటీ ఒక కులం కావచ్చు. మతం కావచ్చు. స్వాతంత్య్రం వచ్చి 57 ఏళ్లుగా అన్ని రంగాల్లో ముస్లిం సమాజాన్ని అణగార్చడానికి అన్ని రకాల కుట్రలు చేసిన సంఘ్‌పరివార్‌ ఇవాళ మాకు రిజర్వేషన్‌ కల్పిం చడాన్ని వ్యతిరేకిస్తోంది. దేశంలోని అన్ని పార్టీలు, సంస్థలు, మేధా వులే కాక సామాన్య జనం సైతం ముస్లింల దైన్య స్థితిని గుర్తిస్తూ రిజర్వేషన్‌ను సమర్థిస్తుంటే కేవలం బీజేపీ మాత్రమే వ్యతిరేకించడం దాని అసలు నైజాన్ని తెలుపుతుంది. ముస్లింలను ఇంకా ఇంకా అణిచి వేసే దేశంలో ఇంకా కొన్ని గుజరాత్‌లను సృష్టించాలని చూ స్తుండడాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. దేశంలో 15 శాతం గా ఉన్న అతిపెద్ద సమూహం అన్ని రకాలుగా వెనకబడి ఉంటే దేశం ఎలా పురోగతి సాధిస్తుందని మేం ప్రశ్నిస్తున్నాం. రాజస్థాన్‌లో ఎన్నిక లకు ముందు ఇబిసి కింద అగ్రకులస్తులకు, బ్రాహ్మణులకు సైతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన బిజెపి అన్ని రంగాల్లో అట్టడుగున పడి ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ఎందుకు సరైన విధానం కాదో పునరాలోఇంచుకోవాలి. ఎన్నికలకు ముందు టీడీపీి సైతం ముస్లింలకు 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటిం చిందతి. అప్పుడు టిడిపి పొత్తులో ఉండి కూడా  చప్పుడు చేయని బీజేపీి యేనని విషయాన్ని ప్రజలంతా గ్రహించాలని కోరుతున్నాం. సామాజికంగా, విద్యాపరంగాఎంతో వెనకబడి ఉన్న ముస్లింలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌కు ప్రజాస్వామిక వాదులందరూ మద్ధతు తెలపాలని కోరుతున్నాం. 191జనాభా లెక్కల ప్రకారం 5 శాతం అన్నారు. 2001 జనాభా లెక్కలు కూడా వచ్చి ఉ న్నాయి. కాబట్టి ప్రస్తుత వెనుకబాటు తనం ప్రాతిపదికగా ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇయ్యాల ఉరికొచ్చి ఉరికొచ్చి / మనమంతి ఇందుగులం / గంగాసింధు బిందుగులం అంటే ఎట్టా సామీ / మా తాతల్ని తండ్రుల్ని పంచముల్ని చేసి గుడికి బడికి దూరంగా తరిమితే / మీకు పడని / అలిఫ్‌-బే-తే-సే-లు దిద్దింది /ఈ మసీదుల్లోనే కదా / ఈ సదువంతా నింపుకుంది / మీరనుకునే పరాయి చర్చిలోనే కదా.. / ఎంత విసిగి వేసారితే / మా లచ్చుమలయ్యలంతా లతీఫ్‌లయిండ్రో / సోమన్నలంతా సామేలులయిండ్రో../ అట్టాంటిదిప్పుడు / మా లందె గోళాల్లో / మీ పూలెట్టా వికసిస్తాయి సామీ అంటున్నారు దున్న యాదగిరి అనే దున్న యాదగిరి. కాబట్టి ముస్లింలను బహునులంతా తమ సోదరులుగా గుర్తించాలని కోరుతన్నాం.

– స్కైబాబ

జఖ్మీ ఆవాజ్‌ నుంచి