మరోమారు రమేశ్‌ బాబు గెలుపు ఖాయం

 

మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి

కథలాపూర్‌ నవంబర్‌ 18(జనం సాక్షి) వేములవాడ ఎంఎల్‌ఎగా రమేశ్‌బాబు గెలుపు ఖాయం అని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కథలాపుర్‌ మండలంలోని చింతకుంట గ్రామంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకి మద్దతుగా టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఇటింటా ప్రచారం నిర్వహించాయి.ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర సత్తాచాటాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి లోక భువనేశ్వరి శశిధర్‌ రెడ్డి,వైస్‌ ఎంపిపి నాంపెల్లి లింబాద్రి,టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నాగం భూమన్న,మాజీ ఎంపిపి నాగం అమృత,చెల్లపల్లి అంజయ్య,కనగందుల గంగాధర్‌,కల్లెడ శంకర్‌,మొహమ్మద్‌ రఫిక్‌,నాగ మల్లేశ్‌,గుండారపు గంగాధర్‌,శీలం మోహన్‌ రెడ్డి,బైర చిన్నమల్లేశ్‌ యాదవ్‌,దేవేందర్‌ రెడ్డి,పానుగంటి భూమగంగారాం,మైస శ్రీధర్‌,కిరణ్‌ రావు,వ్యాస మహర్శి,తోపారపు నర్సయ్య,గుంటుక రవి కుమార్‌,స్వాగత్‌, రమేష్‌ తదితరులు పాల్గన్నారు.