మర్పల్లిలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ.
మర్పల్లి అక్టోబర్ 08 (జనం సాక్షి) మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన, మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా మర్పల్లి మండల కేంద్రంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఆదివారము రోజున ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కలిముద్దీన్, సలీం, కో ఆప్షన్ మెంబర్ సోయల్ షరీఫ్, మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గఫార్, తదితరులు పాల్గొన్నారు.