మలేషియా గద్దెపై మరోమారు మహథీర్‌ 

న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): మలేషియా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు మహథీర్‌ మహ్మద్‌ సారధ్యంలోని విపక్ష పార్టీలు విజయం సాధించాయి. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాల్లో మహథీర్‌ మహ్మద్‌ నేతృత్వంలోని కూటమి విజయం సాధించినట్లు మలేషియా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మలేషియాకు స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి సుమారు 60 ఏళ్లపాటు సాగిన బరిసాన్‌ నేషనల్‌ ప్రభుత్వ పాలనకు తెరపడినట్లయింది. మహథీర్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే పక్షంలో.. 92 ఏళ్ల వయస్సుతో ప్రపంచంలో అత్యంత పెద్దవయస్కుడైన ప్రధానమంత్రిగా నిలుస్తారు. గతంలో 22 ఏళ్లపాటు పరిపాలన సాగించిన మహథీర్‌.. ప్రస్తుత ప్రధాని నజాబ్‌ రజాక్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో విపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో దిగారు.
————