మల్దకల్ తహసీల్దార్ గా హరికృష్ణ
మల్దకల్ ఆగస్టు 10 (జనంసాక్షి) మల్దకల్ తహసీల్దార్ గా హరికృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మల్దకల్ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సరిత రాణి గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఏవోగా బదిలీ కావడంతో ఆమె స్థానంలో ఆర్డీవో కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న హరికృష్ణ మల్దకల్ తాసిల్దారుగా బదిలీ అయ్యారు. నూతన తాసిల్దారును మర్యాదపూర్వకంగా పూలమాల శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తాసిల్దారు మదన్ మోహన్ గౌడ్, ఆర్ ఐ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ ,సిబ్బంది మధు, సుబ్రహ్మణ్యం గౌడ్ ,సాయి, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.