మల్దకల్ పట్టణంలో వీఆర్ఏ లు ర్యాలీ ,నిరసన

మల్దకల్ ఆగస్టు 16 (జనంసాక్షి) రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏ నిరవధిక సమ్మె మంగళవారం 23వ రోజు కొనసాగుతున్న ప్రభుత్వము నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మల్దకల్ మండల వీఆర్ఏ లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 09.09.2020 రోజున అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ, ఈ క్రమంలో వీఆర్ఏ లకు పనిభారంఎక్కువవుతుంది, చాలీచాలని వేతనాలతో నిజాం కాలం నుండి పనిచేస్తున్నారు.వీఆర్ఏ లకు పనికి ప్రతిఫలంగా అందరికీ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏ లకు పే-స్కేల్ జి. ఓ.అమలు,
అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు,55సం,, ల పైబడిన వారసులకు ఉద్యోగం, కల్పిస్తానని హామీ ఇచ్చారు.పై హమీలను (మా హక్కులను) అమలు చేయాలని సమ్మె శిబిరం నుండి మల్దకల్ బస్టాండ్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి,నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏ అద్యక్షులుపుర్ర లక్మన్న నర్సింహులు,నామల వినోద్, భీముడు,లక్ష్మన్ ,హనుమంతు, సత్యమ్మ ,మునెమ్మ ,శంకర్, వెంకట్రాములు,రంగమ్మ, ఎల్లప్ప, నాగార్జున,మల్దకల్ మండల వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.