మళ్లీ అధికారం కాంగ్రెస్‌దే 

120 స్థానాల్లో గెలుస్తామన్న సిద్దరామయ్య
బెంగళూరు,మే10(జ‌నం సాక్షి):  కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని సిఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. మరోమారు ఇక్కడ అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. ప్రచారం ముగుస్తున దశలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యాలను ప్రజలు గమనించారని, బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 120కిపైగా సీట్లు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హంగ్‌ వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఏపీకి ¬దా విషయంలో ప్రధాని మోదీ మోసం చేశారని, ఆయన పట్ల తెలుగు ప్రజలు కోపంగా ఉన్నారని, ఈసారి బీజేపీకి బుద్ది చెబుతారని అన్నారు.గురువారం సాయంత్రంతో కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో నేతలు పోటా పోటీగా ప్రచారం చేపట్టారు. 12న పోలింగ్‌ జరగనుంది. ఇందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రజల తీర్పుపై  ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే మాకు శ్రీరామరక్ష. ప్రధానమంత్రి, కేంద్రమంత్రి అయినంత మాత్రాన మోదీ, అనంత్‌కుమార్‌ హెగ్డే రాష్ట్రం కోసం ఏవిూ చేయలేదు. అలాంటి వాళ్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఫలితం పట్ల గత ఎన్నికల కంటే ఎక్కువ నమ్మకంతో ఉన్నామని అన్నారు. తామిచ్చిన హావిూలన్నీ దాదాపుగా అన్నీ అమలు చేశాం. ఈ ఎన్నికల్లో అదే మాకు
సానుకూలాంశం. దీంతో 120 స్థానాలకంటే ఎక్కువ గెలుచుకుంటామనే నమ్మకం ఏర్పడింది. సందర్భానికి తగినట్లు నిర్ణయాలు తీసుకుని ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌ నైజం కాదు. గోడ విూద పిల్లుల్లాగా మేం ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. 23 అవినీతి కేసులున్న యడ్యూరప్పను కర్ణాటక సీఎం చేయడం కోసం ప్రధాని తపన పడుతున్నారు. అదే మాకు కలిసొచ్చే అంశం. యడ్డీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సాధించిన ఒక్క అభివృద్ధి గురించి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఆయనపై మోదీ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని స్థాయి ఉన్న వ్యక్తి ఒక అవినీతి పరుడికి బాసటగా నిలవడం ఏమిటని నిలదీసారు.
దేశవ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు ఖర్చుచేసిన నిధుల్లో దాదాపు సగం కర్ణాటకలోని దళితులకు, గిరిజనులకు ఖర్చు చేశాం. అలాంటిదీ మా ప్రభుత్వానికి దళితులపై వ్యతిరేక భావం ఉందని మోదీ వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా దళితులపై భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న అకృత్యాలు ఆయనకు ఎందుకు కనిపించడం లేదన్నారు.
—————-