మళ్లీ పెరిగిన బంగారం ధరలు

న్యూఢిల్లీ,మే18(జ‌నం సాక్షి ): డిమాండ్‌ లేమితో గత రెండు రోజులుగా భారీగా పడిపోయిన బంగారం ధర శుక్రవారం మళ్లీ  పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా కొనుగోళ్లు ఎక్కువవడంతో పసిడికి మళ్లీ డిమాండ్‌ వచ్చింది. శుక్రవారం నాటి మార్కెట్లో రూ. 210 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 31,990గా ఉంది. అటు వెండి కూడా నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 120 పెరగడంతో బులియన్‌ మార్కట్లో కేజీ వెండి ధర రూ. 40,870గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెళిల 
తయారీదారుల నుంచి డిమాండ్‌ రావడంతో ధర పెరిగిందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టింది. సింగపూర్‌ మార్కెట్లో 0.12శాతం తగ్గి ఔన్సు పసిడి ధర 1,288.70డాలర్లుగా ఉంది.
—–