మశ్రోబా ఎస్టేట్‌లో నాడు సందర్శనకు నిరాకరణ

నేడు అధికారికంగా విడిది కోసం ఆహ్వానం
కోవింద్‌కు ఎదురవుతున్న వింత అనుభవం
న్యూఢిల్లీ,మే19(జ‌నం సాక్షి): నాడు అనుమతి లేని భవంతిలోకి నేడు అధికారికంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెళ్లనున్నారు. రాజ‌కీయాల్లోఎప్పుడు ఏం జరుగుతుందో అన్నదానికి ఇదో ఉదాహరణ. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌ మశోబ్రా సందర్శనకు కోవింద్‌ వెళ్లనున్నారు. అందులో ఆయన మూడు రోజులు బస చేస్తారు. ఏడాది క్రితం బిహార్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇదే ఎస్టేట్‌ను రామ్‌నాథ్‌ కోవింద్‌ సందర్శించాలనుకున్నారు. అయితే అప్పటి రాష్ట్రపతి అనుమతి లేదంటూ ఆయనను మశోబ్రా ఎస్టేట్‌లోకి భద్రతా సిబ్బంది వెళ్లనివ్వకపోవడంతో ఆయనకు నిరాశే ఎదురైంది. గేటు వద్దే అడ్డుకోవడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కాగా ఇప్పుడు రాష్ట్రపతి ¬దాలో అధికారికంగా పర్యటనకు వెళ్తుండడం గమనార్హం. గతేడాది జూన్‌లో బిహార్‌ గవర్నర్‌గా ఉన్న కోవింద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్‌ వెళ్లారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ ఆహ్వానం మేరకు కుటుంబంతో సహా వెళ్లిన కోవింద్‌ షిమ్లా సహా మరికొన్ని ప్రాంతాలు సందర్శించారు. తిరుగు ప్రయాణంలో షిమ్లాకు 14 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌ చూద్దామని వెళ్లారు. కోవింద్‌ అధికారిక వాహనంలో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు క్యాబ్స్‌లో ఉన్నారు. అయితే ఎస్టేట్‌ వద్ద సిబ్బంది కోవింద్‌ను అడ్డుకున్నారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి అనుమతి ఉండాలని చెప్పారు. దీంతో కోవింద్‌ మారు మాట్లాడకుండా వెను దిరిగి వెళ్లిపోయారు. వచ్చింది బిహార్‌ గవర్నర్‌ అని కొద్ది సేపటి తర్వాత గానీ అక్కడి సిబ్బందికి తెలియలేదు. సోమవారం రాష్ట్రపతిగా అధికారిక ¬దాలో కోవింద్‌ ఆ బంగ్లాకు తిరిగి వెళ్లనున్నారు. సిబ్బంది నుంచి స్వాగత సత్కారాలు అందుకోనున్నారు. హిమాచల్‌లోని మశ్రోబా ఎస్టేట్‌ను 1850లో నిర్మించారు. ఇది ప్రెసిడెంట్‌ కార్యాలయం ఆధీనంలో ఉంటుంది. 987చదరపు విూటర్ల విస్తీర్ణంలోని ఈ బంగ్లా రాష్ట్రపతి బస చేసేందుకు ఉపయోగించే రెండో బంగ్లా. మొదటిది హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం.