మహంకళి ఆలయంలో మహా అన్నదానం…
బేల, అక్టోబర్ 7 ( జనం సాక్షి ) మండల కేంద్రము లోని మహంకాళి ఆలయంలో దేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ అద్వర్యములో దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తిర్థ ప్రసాదం అందించారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ప్రసాదాన్ని స్వీకరించారు..