*మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం*

 *అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం*                                  *అలంపూర్ ఆగస్టు14 (జనం సాక్షి)*  అనాటి మహనీయుల త్యాగాల ప్రతిఫలమే నేటి స్వతంత్ర భారతం,వారి త్యాగాలు మరువలేనివని, అలంపూర్ ఎమ్మెల్యే    అబ్రహం అన్నారు.స్వతంత్ర  భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కెసిఆర్ ఆదేశాల  మేరకు అలంపూర్ మున్సిపాలిటీలో మాంటేస్వరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారధి కళాకారుల చేత ప్రత్యేక సాంస్కృతిక జానపద కళాకారుల ప్రదర్శనల ఆదివారం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే అబ్రహం హాజరైయారు.ఈసందర్బంగా అయన గాంధీజీ  చిత్ర పట్టనికి పూల మాల వేసి నివాళులు అర్పించి,జ్యోతి ప్రజ్వలన చేశారు.  కళాకారులు సంస్కృతి ఆట పాటలు తో ప్రదర్శన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ
 భారతావని స్వాతంత్రం సిద్దించుకొని 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమర యోధులను స్మరించుకునే విధంగా,వారి పోరాట పటిమను గుర్తుచేసుకునే విధంగా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కేసీఆర్  నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ కు  ధన్యవాదాలు తెలిపారు.ఆనాడు మహాత్ముల వీరోచిత పోరాటం,వారి త్యాగ ఫలమే భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించింది వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలిఅన్నారు.
 మహనీయుల పట్ల వారి త్యాగాల పట్ల ఇటీవలి పరిణామాలు బాధాకరంఅని,
 మహనీయుల పోరాట స్ఫూర్తిని మరొక్కసారి గుర్తు చేసుకునేందుకే ఈ 15 రోజుల వేడుకలుజరుగుతుంది, ఇందులో భాగస్వామ్యం అవతున్నందుకు గర్వపడుతున్నానుఅన్నారు.
15 రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం అధికారికంగా నిర్వహించటం అనందకరం కారం అనిఅయన అన్నారు.
75 ఏళ్లలో దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున నా కృతజ్ఞతలుతెలిపారు.
స్వాతంత్రం అనేది మూడక్షరాల మాట కాదు,మనకి ఎన్ని ఉన్నా స్వేచ్ఛ లేకుంటే తృప్తి ఇవ్వదు అన్నారు.
 తెలంగాణ ఉద్యమం కూడా స్వత్యంత్ర పోరాటంతో సమానం.అని వారిసేవలు గుర్తు చేసారు,మహాత్ముడు చూపిన దారిలో ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించారుఅన్నారు.
సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారుఅన్నారు.
 గ్రామ స్వరాజ్యం అనుకూలంగా పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధికి కృషి చేసి,బాపుజి కలలు గన్న నిజమైన స్వరాజ్యం సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.
 కేంద్రం ప్రకటించిన ఆదర్శ గ్రామాల్లో జిల్లా నుండి 4 గ్రామాలు దేశంలోనే ముందువరుసలో ఉండటం గర్వకారణం..ఇది నిజమైన స్వాతంత్రయం అన్నారు.
 తెలంగాణ అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం అవుదామని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుఅన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మనోరమ , వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి ,మాజీ ఆలయ చైర్మెన్ నారాయణ రెడ్డి , కౌన్సిలర్లు సుష్మ ఇంతి యాజ్ అలి , కోఆప్షన్ సభ్యులు అల్లా భాకసు , వలి ,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి ,ఆలయ ధర్మకర్త హరిబాబు ,కమిషనర్ నిత్యానంద , ఎపీఎం పరిజతమ్మ ,దండోరా మద్దిలేటి ,MEO అశోక్ , కేజీవీబీ ఫర్జానా బేగం ,కళాకారులు రెలారే ప్రసాద్  బృందం అధికారులు, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.