మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ఎంపీపీ స్నేహ

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 15 : దేశంలో ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఎంపీపీ స్నేహ అన్నారు. సోమవారం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్నేహ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి మహమ్మద్ అయూబ్, ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ రాజు, మండల మహిళ సమైక్య భవనంలో అధ్యక్షురాలు పద్మమ్మ, ఇటిక్యాల పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్సై గోకారి, కోదండాపురం సిఐ కార్యాలయంలో సిఐ సూర్య నాయక్, పుటాన్ దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ ఇ. రంగారెడ్డి, ఇటిక్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ తిరుపతయ్య, బీచుపల్లి గురుకుల పాఠశాలలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీరారెడ్డి, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రిన్సిపాల్ సోఫియాబేగం, ఎర్రవల్లి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రఘు లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహేశ్వరమ్మ, ఆర్. గార్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పద్మ, బి. వీరాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాముడు, ధర్మవరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ మధునాయుడు, సాసనూలు గ్రామ పంచాయతీలో సర్పంచ్ మల్లన్న, షేక్ పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ జోగుల రవి, బీచ్ పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నరసమ్మ, తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ నాగేశ్వరి, పూటన్ దొడ్డి గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్వాతి, కోదందాపురం గ్రామ పంచాయతీలో ఓటు సుంకన్న, చాగాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ వెంకటన్న, వేముల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మర్యమ్మ తో పాటు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచులు స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించి, జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే ఎర్రవల్లి సరస్వతి స్కూల్, ఏకశీల ఇంటర్నేషనల్ స్కూల్, అక్షర స్కూల్ తోపాటు గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల, ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ర్యాలీలు, నృత్యాలు చేపట్టి భారత్ మాతాకీ జై అంటూ దేశనాయకుల స్మరిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు ప్రసంగించి విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టి 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంత్ రెడ్డి, ఆర్ఐలు ప్రశాంత్ గౌడ్, అజిత్, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.