మహబూబాబాద్‌లో బండలిసిరిన ‘కొండా’.. పరకాలలో నిన్నెట్ల నమ్మాలె బంగారు కొండా?
తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు.
ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నించాడు. కానీ, తెలంగాణ బిడ్డల ఆగ్రహాన్ని తట్టుకోలేని ఆ సమైక్యవాది వెనుకడుగు వేయక తప్పలేదు. నాడు జగన్‌కు మద్దతుగా నిలిచి, నేడు ఆ జగన్ పార్టీ నుంచే పరకాలలో పోటీ చేస్తున్న కొండా సురేఖ తెలంగాణవాదులపై స్వయంగా
రాళ్లు విసిరినప్పటిది పైన కనిపిస్తున్న ఫొటో. అప్పుడు తెలంగాణ బిడ్డలపైనే పిస్తోలు గురి పెట్టించిన ‘కొండా’, ఇప్పుడు పరకాలలో ఓట్లడుగుతున్నది. ఈమెను జనం నమ్ముతారా ? పై ఫొటోపై, నేడు కొండా సురేఖ చేస్తున్న ప్రచారంపై మీ అభిప్రాయాన్ని పేరు, ఫొటోతో సహా మాకు పంపండి. ‘జనంసాక్షి’లో ప్రచురించి, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం.