మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగుజాడల్లో నడవాలి
నిర్మల్ బ్యూరో, అక్టోబర్01,జనంసాక్షి,,, మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగుజాడల్లో నడవాలని జమీయత్ ఉలుమా హింద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. మౌలానా సయ్యద్ అష్ హద్ రషీది అన్నారు.శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ జమీయత్ ఉలమా హింద్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త సల్లెల్లాహు అలైవా వసల్లం జీవితం ‘మానత్వంలో చూపు’ బహిరంగ సభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తి గయాసుద్దీన్ రహమాని, ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఫ్తి మహమూద్ జుబేర్ కాస్మి. నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముఫ్తి కలీం, ముఫ్తి పైసల్ సహాబ్, రాష్ట్ర కార్యదర్శి రషీద్ ఆలం, కుల పెద్దలు, జిల్లా మస్జిద్ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, యువకులు పాల్గొన్నారు.