మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా సివిల్ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసిన ముస్లిం మత పెద్దలు.
జనం సాక్షి, నర్సంపేట
మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఈరోజు నర్సంపేట పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసిన ముస్లిం మత పెద్దలు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు మహమ్మద్ ప్రవక్త బోధనల అనుసారంగా పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ప్రపంచశాంతికి స్నేహభావంతో కలిసి జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, బీ ఆర్ ఎస్ పార్టి పట్టణ అధ్యక్షులు, హాస్పటల్ సూపరిండెంట్, క్లస్టర్ బాధ్యులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.