మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్  బారి ర్యాలీ 

నాగిరెడ్డిపేట 09 అక్టోబర్  జనం సాక్షి మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి  మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా రాత్రంతా జాగారం లో ఉన్న ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు
మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో  ఘనంగా జరుపుకున్నారు  ముస్లిం సోదరులు వాహనాలకు జండా తో అలంకరించి ఊరేగింపు తీసి అన్నదానం తోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మొహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గం లో అంతా నడవాలని అన్నారు ముస్లిం మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు గోపాల్ పెట్  లో భారీ ర్యాలీ నిర్వహించారు గోపాల్ పెట్ జామా మజీద్ నుండి ప్రారంభమైన ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో పిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొన్నారు మహమ్మద్ ప్రవక్త
గొప్పతనాన్ని ఇస్లాం మతం గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ ప్రారంభించారు ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు మహమ్మద్ ప్రవక్త లోకానికే శాంతి సందేశాన్ని ఇచ్చారని ప్రతి ఒక్కరిని సోదర సమానులు గా భావించాలని కోరారు ప్రవర్త సూచించిన మార్గం జీవనం గడపాలి అన్నారు ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ గోపాల్పేట్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు