మహాకూటమికి ఓటమి భయం: రామలింగారెడ్డి


సిద్దిపేట,నవంబర్‌15(జ‌నంసాక్షి):  మహా కూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని దుబ్బాక టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు.  కనీసం అభ్యర్థులను సకాంలో ప్రకటించలేని దుస్థితిలో పార్టీలు ఉన్నాయని  అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ అధికారం ఇస్తే  పథకాలను అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచారన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే రూ.30వేలు ఖర్చు అవుతుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు మ్యానిఫెస్టోలో లేకున్నా పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కేసీఆర్‌ అమలు చేశామన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని తెలుస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలను ప్రవేశ పెట్టలేదన్నారు. ఆసరా పింఛన్ల పై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. పింఛన్లను రూ. 2016కు పెంచుతామని ప్రకటించగానే పింఛన్‌దారులు హర్షం వ్యక్తం
చేస్తున్నారన్నారు.