మహాకూటమిదే అంతిమ విజయం
తెలంగాణకు విముక్తి కల్పిచడమే తక్షణ కర్తవ్యం
నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతాం: బట్టి
ఖమ్మం,నవంబర్21(జనంసాక్షి): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మహాకూటమిగా జట్టు కట్టామని, దళిత బహుజనులను దగా చేసిన టీఆర్‌ఎస్ ఫాంహౌస్ పాలనకు చరమగీతం పాడాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. అన్ని వర్గాల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ఆగమైందన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమి అధికారంలోకి రావాలంటే తమ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అన్నారు. రతైలుకు బేడీలు వేసిన చరిత్ర ఇప్పుడు కెసిఆర్ ప్రబుత్వానిదన్నారు. ఇసుక మాఫియాకు మద్దతుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపరిధిలోని నేరెళ్ల, మంథని, బొంపల్లి ఘటనలు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నేటి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కాళేశ్వరం వరకు చేపట్టామని, కొత్తగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదని, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయలేదని, కాళేశ్వరంపై ఆర్భాటం చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను అమలు చేసే బాధ్యత తమదేనని అన్నారు. విద్యారంగాన్ని అధోగతి పాలుచేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రతి ఒక్కరు ఆండగా నిలవాలని పిలుపునిచ్చారు. నిరంకుశపాలన అంతం కోసం మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ మార్పుకోసం ప్రజలు, మేధావులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వజ్ర సంకల్పంతో లక్ష్యాన్ని ఎంచుకొని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ విద్య అంటూ మభ్యపెట్టిన కెసిఆర్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. కేజీ టు పీజీ అమలు చేస్తామని ఆరువేల పాఠశాలలు మూసివేశారని అన్నారు. టీఆర్‌ఎస్
పాలనలో తెలంగాణాకు నాలుగున్నరేళ్లు పట్టిన గ్రహణం వదిలించాల్సి ఉందని భట్టి అన్నారు. తెలంగాణను పాలించమని కేసీఆర్‌ను గెలిపిస్తే.. చేతకాక నాలుగున్నరేళ్లకే పారిపోయాడని ఎద్దేవా చేశారు.